కొత్త విలన్ ను తీసుకొస్తున్న పూరి జగన్నాథ్ !

12th, November 2017 - 11:01:32 AM

ఆకట్టుకునే పాత్రలని రాయడంతో పాటు వాటి కోసం సరేన నటీ నటుల్ని ఎంపిక చేసుకోవడంలో కూడా దర్శకుడు పూరి జగన్నాథ్ ది ప్రత్యేక శైలి. ఈ శైలితోనే ఆయన ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమకు ఎంతో మంది కొత్త హీరోయిన్లను, విలన్లను పరిచయం చేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు ఆకాష్ పూరితో చేస్తున్న ‘మెహబూబా’ చిత్రంతో కూడా ఒక కొత్త ప్రతినాయకుడ్ని మనకు పరిచయం చేయనున్నారు.

అతనే విష్ణు రెడ్డి. 2009 లో మిస్టర్ సౌత్ ఇండియాగా ఎంపికైన విష్ణు రెడ్డి ‘మెహబూబా’ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ హైదరాబాదీ యువకుడు చేసిన మార్షల్ ఆర్ట్స్, ఇతర వీడియోలను చుసిన పూరి పలు ఆడిషన్స్ నిర్వహించి సినిమాకు ఎంపిక చేసుకున్నారట. ఈ చిత్రంలో తన పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, అందుకోసం పూర్తిగా తన లుక్ ను మార్చుకున్నానని, పురిగారి దర్శకత్వంలో నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు విష్ణు రెడ్డి. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి జగన్ టూరింగ్ టాకీస్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఆకాష్ పూరికి జంటగా కొత్త హీరోయిన్ నేహా శెట్టి నటిస్తోంది.