పూరీ ఇచ్చే ఆ ‘ఇజం’ సర్‌ప్రైజ్ ఏంటి?

17th, October 2016 - 12:25:00 PM

ism
దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇజం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈనెల 21న విడుదలకు సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉండగా, సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్స్‌తో అంచనాలను మరింత పెంచేస్తోన్న టీమ్, ఈ క్రమంలోనే భాగంగా ఈ సాయంత్రం ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందట.

పూరీ జగన్నాథ్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ సాయంత్రం 6 గంటలకు ఇజంకు సంబంధించి ఒక సర్‌ప్రైజ్ ఉందని అన్నారు. విడుదలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు పూరీ ప్లాన్ చేసిన ఈ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకూ ఇజం ట్రైలర్ విడుదల చేయకపోవడం, బహుశా ఆ సర్‌ప్రైజ్ ట్రైలర్ అయి ఉండొచ్చని వినిపిస్తోంది. అసలు సర్‌ప్రైజ్ ఏంటో తెలియాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే. కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటించారు.