మహేష్ స్క్రిప్ట్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్న పూరి !


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్ని నెలల క్రితమే ‘జన గణ మన’ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ ఆ ప్రాజెక్టులో హీరోగా నటిస్తారని, త్వరలోనే సినిమా మొదలుతుందని అన్నారు. కానీ మహేష్ బాబుకు వేరే కమిట్మెంట్స్ ఉండటం వలన ఆ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమైంది. దీంతో పూరి కూడా నందమూరి బాలకృష్ణతో ఒక సినిమాని మొదలుపెట్టారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పూరి ‘జన గణ మన’ గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.

సాధారణంగా ఒక స్క్రిప్ట్ కోసం కేవలం కేవలం 15 రోజులు మాత్రమే కేటాయించే తను ‘జన గణ మన’ స్క్రిప్ట్ కోసం మాత్రం ఏకంగా రెండు నెలలు కేటాయించానని అన్నారు. అలాగే స్క్రిప్ట్ ను మహేష్ కు కూడా వినిపించానని 2018 లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని అన్నారు. ప్రస్తుతం మురుగదాస్ తో ‘స్పైడర్’ చేస్తున్న మహేష్ తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ చేయనున్నారు.