బ్యాంకాక్ లో కూర్చుని ఎన్టీఆర్ కోసం కథ రాస్తున్న పూరి !

Puri
టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ డి కాస్త డిఫరెంట్ స్టైల్. ఏది చేసినా కాస్త కొత్తగా, రిచ్ గా ఉండేలా చేస్తాడాయన. మరీ ముఖ్యంగా సినిమాలకి కథలు రాసేటప్పుడు ఆయనసలు ఇండియాలోనే ఉండరు. చక్కగా బ్యాంకాక్ వెళ్ళిపోయి 10 – 15 రోజుల్లో పూర్తి కథను రాసుకొచ్చేస్తారు. అలా బ్యాంకాక్ లో ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్న సూపర్ హిట్ కథలెన్నో ఉన్నాయి. ప్రస్తుతం ‘ఇజం’ షూటింగ్ పార్ట్ ముగించేసిన అయన ఎన్టీఆర్ కోసం కథ రాయడానికి బ్యాంకాక్ లో సిట్టింగ్ వేశారు.

‘జనతా గ్యారేజ్’ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ మరే సినిమాకీ కమిటవ్వలేదు. పూరి చెప్పిన స్టోరీ లైన్ నచ్చి పూర్తిస్థాయి స్క్రిప్ట్ రాసుకురమ్మని చెప్పారు కూడ. అందుకే పూరి బ్యాంకాక్ వెళ్లారని, ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ తో తిరిగొచ్చి తారక్ కు వినిపిస్తారని సమాచారం. మరి ఎన్టీఆర్ పూరికి గ్రీ సిగ్నల్ ఇస్తాడా ? లేదా? అన్నది ఇంకో వారం రోజుల్లో తేలిపోతుంది.