పూరి.. కొత్త సినిమా ఎప్పుడు ?

Published on Mar 26, 2023 1:40 am IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వారంతా పూరి కొత్త సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క లైగర్ ప్లాప్ తర్వాత పూరి సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అందుకే పూరి జగన్నాథ్ అభిమానులంతా ‘కొత్త సినిమా ఎప్పుడు ?’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఐతే, పూరి.. బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్యకి పూరి జగన్నాథ్ ఓ కథ చెప్పాడని, బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఓ రూమర్ వైరల్ గా మారింది. మరి ఈ రూమర్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు.

నిజానికి పూరి జగన్నాథ్ ప్రస్తుతం మెగాస్టార్ లేదా బాలయ్యతో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించడానికి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. గతంలో చిరుకి ఆటోజానీ కథ చెప్పాడు. ఆ కథ పైనే పూరి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. పూరి రాస్తున్న ఈ కథ మెగాస్టార్ కి నచ్చకపోతే, బాలయ్య దగ్గరకు వెళ్తుంది. ప్రస్తుతానికి పూరి దగ్గర ఉన్న ప్లాన్ ఇది. మరి చివరకు పూరి సినిమా ఎటు వైపు వెళ్తుందో చూడాలి. ఏది ఏమైనా పూరి జగన్నాథ్ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :