ఇజం’లోనూ పూరీది అదే స్టైల్..!

14th, October 2016 - 02:14:41 PM

ism
తెలుగులో దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలంటే పడి చచ్చే అభిమానులున్నారు. మళ్ళీ మళ్ళీ చూడదగ్గ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన పూరీకి, హీరోలను కొత్తగా పరిచయం చేయడం, ఇంటెన్సిటీ ఉన్న డైలాగులు రాయడం లాంటివి ఒక అలవాటుగా మారిపోయాయి. ఇక ఆయన సినిమాల్లో కనిపించే మరొక ప్రధాన అంశం ఏంటంటే రేసీ నెరేషన్. ఎక్కడా సినిమాను నెమ్మదిగా నడిపించకుండా, వేగంగా, తక్కువ రన్‌టైమ్‌లో చెప్పాల్సిందంతా చెప్పేస్తుంటారు.

తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇజం’ కూడా ఇదే స్టైల్లో రేసీ స్క్రీన్‌ప్లేతో నడుస్తుందట. ఇంటర్నేషనల్ బ్లాక్ మనీని టార్గెట్ చేసిన సినిమాగా ప్రచారం పొందుతోన్న ‘ఇజం’ రన్‌టైమ్ 2 గంటల 8 నిమిషాలు మాత్రమే! ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు ఇది తక్కువ రన్‌టైమే. పూరీ స్టైల్లో, ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో సినిమా నడుస్తుందట. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా, నిన్నటితో సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని అక్టోబర్ 21న విడుదలకు సిద్ధమైంది.