విజయ్ దేవరకొండ ‘జన గణ మన’ పై క్రేజీ అప్ డేట్ !

Published on Jul 5, 2022 1:15 am IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ప్రస్తుతం ‘లైగర్’ సినిమా వస్తోంది. ఐతే.. ఈ సినిమా రిలీజ్ కాకముందే
విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ కలయికలో మరో సినిమా ‘జన గణ మన’ రాబోతుంది. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ ను రష్మిక మందన్నా చేయబోతోందని తెలుస్తోంది.

రష్మిక మందన్నా ‘జన గణ మన’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తే.. ఈ సినిమాకి ఫుల్ హైప్ వస్తోంది. మరి ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ ను రష్మిక మందన్నా నిజంగానే చేస్తోందా ? లేదా ? అనేది చూడాలి. ఇక విజయ్ దేవరకొండ చాలా రోజుల నుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి లైగర్ సినిమాతో పూరి, విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :