‘ఇడియట్’ ని గుర్తు చేస్తున్న పూరి ‘రోగ్’ !


సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ని చాలా ప్రభావంతంగా, సంవత్సరాల తరబడి గుర్తుండిపోయే విధంగా డిజైన్ చేయడంలో దర్శకుడు పూరి జగన్నాథ్ సిద్ధహస్తుడు. ఆయన తన సినిమాల్లో క్రియేట్ చేసిన కొన్ని హీరో పాత్రలు ‘చంటి (ఇడియట్), బద్రి(బద్రి), పండు (పోకిరి), బుజ్జి (భిజ్జిగాడు), రవి (నేనింతే)’ వంటివి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్రలు. ఇప్పుడు తాజాగా అలాంటి పాత్రనే ఒకదాన్ని క్రియేట్ చేశాడు పూరి.

నూతన నటుడు ఇషాన్ ను హీరోగా పరచయం చేస్తూ పూరి డైరెక్ట్ చేసిన కొత్త చిత్రం ‘రోగ్’ తాలూకు మోషన్ పోస్టర్ కాసేపటి క్రితమే విడుదలైంది. మరో చంటిగాడి ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ తో మొదలయ్యే ఈ పోస్టర్లో హీరోని చూస్తుంటే ‘ఇడియట్’ లో రవితేజ పాత్ర కళ్ళముందు కదులుతోంది. పరిశ్రమలో కూడా మొదటి నుండి ఈ చిత్రం మరో ‘ఇడియట్’ అవుతుందని, ఇషాన్ ను స్టార్ హీరోని చేస్తుందని వార్తలు వినిపిస్తోనే ఉన్నాయి. ఆ వార్తలకు తగ్గట్టే ఉంది పోస్టర్. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనుండగా సల్మాన్ ఖాన్ ఈ సినిమాని హిందీలో సూరజ్ పంచోలిని హీరోగా పెట్టి రీమేక్ చేసే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది.

మోషన్ పోస్టర్ కొరకు క్లిక్ చేయండి: