‘పురుష:’ నుంచి హీరోయిన్ విషిక ఫస్ట్ లుక్.. ఆకట్టుకుంటున్న ‘రఫ్’ పోస్టర్!

భార్యాభర్తల మధ్య సాగే వినోదాత్మక పోరాటంతో ‘పురుష:’ అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతుండగా, వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

​తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ విషిక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘దమ్ముంటే టచ్ చేసి చూడు’ అనే క్యాప్షన్‌తో రఫ్‌గా కనిపిస్తున్న విషిక పాత్ర పోస్టర్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంతకుముందు వైష్ణవి పాత్రను ఎమోషనల్‌గా, హాసిని పాత్రను రెబల్‌గా పరిచయం చేసిన చిత్ర యూనిట్.. తాజాగా విషిక లుక్ ద్వారా సినిమాలోని కామెడీ మరియు యాక్షన్‌ను హింట్ ఇచ్చారు.

​వెన్నెల కిషోర్, వి.టి.వి. గణేష్, అనంత శ్రీరామ్ వంటి ప్రముఖ కమెడియన్లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version