‘పుష్ప’ 10వ రోజు కలెక్షన్స్.. నైజాంలో తగ్గేదే లే !

Published on Dec 27, 2021 2:00 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’. గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కొన్ని చోట్ల మిశ్రమ స్పందనకు గురైనా.. మార్నింగ్ షో నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. ఇప్పటివరకు అయితే.. కలెక్షన్స్ విషయంలో ‘పుష్ప’ నైజాంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

కాగా ‘పుష్ప’ నైజాం 10వ రోజు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 10 వ రోజు పుష్ప 1.65 కోట్ల రూపాయలు షేర్ ని రాబట్టి డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఆంద్రలో 10వ రోజుకు గానూ 1.15 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే.. 10వ రోజు గానూ 70 లక్షలు వసూలు చేసింది.

మొత్తం చూస్తే.. 10వ రోజు గానూ ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని : 3.5 కోట్లు కలెక్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :