బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద “పుష్ప” 18రోజుల కలెక్షన్ డీటెయిల్స్.!

Published on Jan 4, 2022 4:50 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం “పుష్ప ది రైజ్”. తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ హ్యాట్రిక్ సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అయితే వీరిద్దరికీ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో కాస్త ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి.

ఇక దీనితో పాటు అల్లు అర్జున్ కి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొట్ట మొదటి థియేట్రికల్ ఎంట్రీ కూడా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. అయితే పుష్ప మాస్ వసూళ్లు హిందీలో గత వీకెండ్ లో అయితే ఊహించని రేంజ్ లో వచ్చింది. దీనితో ఆల్రెడీ హిందీలో పుష్ప బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ఈ సినిమా ఇప్పుడు 18వ రోజు వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి.

ఈ సినిమా మూడో వారం మొదటి సోమవారం 2.75 కోట్లు రాబట్టిందట. దీనితో ఒక్క హిందీలోనే పుష్ప వసూళ్లు 65 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది. దీనితో అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్న 75 కోట్ల మార్క్ ని అయితే పుష్ప అందుకోవడం చాలా సులువని అర్ధం అవుతుంది. అలాగే ఇది 80 కోట్ల దగ్గర ఆగినా ఆశ్చర్యం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :