“పుష్ప” రాజ్ మ్యానియా..అప్పుడలా ఇప్పుడిలా.!

Published on May 23, 2023 2:00 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తన సెన్సేషనల్ హిట్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ చిత్రం వారి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా వచ్చి అంచనాలను మించి భారీ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకి ఆడియెన్స్ లో ఎన్నో రకాలుగా అయితే భారీ రీచ్ సొంతం చేసుకుంది. అది లోకల్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్ళింది.

అయితే ఇక ఇప్పుడు పుష్ప 2 కి కూడా ఇదే మ్యానియా స్టార్ట్ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. అప్పుడు పుష్ప 1 కి తగ్గేదేలే మ్యానరిజం తర్వాత శ్రీవల్లి హుక్ స్టెప్ లు ఓ రేంజ్ లో సెన్సేషన్ గా మారగా ఇప్పుడు అయితే పుష్ప 2 నుంచి బన్నీ వేసిన ఛాలెంజింగ్ గెటప్ ఫస్ట్ లుక్ పోస్టర్ లుక్ అయితే తెలుగు రాష్ట్రాలు సహా నార్త్ లో కూడా ఓ రేంజ్ లో రీచ్ సొంతం చేసుకుంది.

రాజకీయ నాయకులు, ఇతర ఆర్టిస్ట్ లు సహా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ గెటప్ లో కనిపిస్తుండడం క్రేజీ అంశం అని చెప్పాలి. మొత్తానికి అయితే పుష్ప 1 తో పాటుగా పుష్ప 2 కి కూడా ట్రెండ్ సెట్టింగ్ రీచ్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక సినిమా, పాటలు రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :