అక్కడ బడా సినిమాలని డామినేట్ చేస్తున్న ‘పుష్ప – 2’ క్రేజ్

Published on Mar 10, 2023 7:30 am IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా సూపర్ హిట్స్ తో పాటు మంచి క్రేజ్ తో నేషనల్ వైడ్ గా దూసుకెళ్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన పుష్ప ది రైజ్ మూవీ ఎంతో పెద్ద సక్సెస్ అందుకుని పాన్ ఇండియన్ రేంజ్ లో అన్ని భాషల ఆడియన్స్ ని అలరించింది. ఇక ఆ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైల్, డైలాగ్స్, ఫైట్స్, సాంగ్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ప్రస్తుతం దానికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 మూవీ అయిన పుష్ప ది రూల్ పై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం శరవేంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

అయితే విషయం ఏమిటంటే, నార్త్ లో గత కొన్నాళ్లుగా పలు మీడియా సర్వేల్లో చూసుకుంటే పలు సౌత్ పాన్ ఇండియన్ మూవీస్ తో పాటు పలు బాలీవుడ్ సినిమాలను మించేలా పుష్ప 2 పై హైప్ ఆడియన్స్ లో ఉన్నట్లు తెలుస్తోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎక్కడ చూసినా ముఖ్యంగా అయితే పుష్ప 2 డామినేషన్ స్పష్టం గా కనపడుతోందని, సినిమా రిలీజ్ తరువాత ఆడియన్స్ ని ఆకట్టుకుంటే నార్త్ లో ఈ మూవీ కి భారీ స్థాయి కలెక్షన్స్ లభించే అవకాశము ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం :