ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా హిట్ చిత్రమే “పుష్ప 2 ది రూల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు అందుకోగా ఇటీవల దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి రాగ ఇందులో రికార్డు రెస్పాన్స్ ని అందుకుంది.
ఇలా వచ్చిన నాలుగు రోజుల్లోనే రికార్డు వ్యూస్ అందుకోగా ఇపుడు స్ట్రీమింగ్ గంటల్లో కూడా బిగ్గెస్ట్ రికార్డు అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలా పుష్ప 2 సినిమా 22 మిలియన్ స్ట్రీమింగ్ హవర్స్ మొదటి వారానికి లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో నెట్ ఫ్లిక్స్ హిస్టరీలో ఇదొక బిగ్ రికార్డు అని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ రికార్డులు అలాగే గ్లోబల్ రీచ్ పరంగా కూడా కొత్త స్టాండర్డ్స్ అందుకుంటుంది అని చెప్పాలి.