తెలుగు స్టేట్స్ సింగిల్ స్క్రీన్ లో “పుష్ప 2” హిస్టరీ.. ఎక్కడంటే

తెలుగు స్టేట్స్ సింగిల్ స్క్రీన్ లో “పుష్ప 2” హిస్టరీ.. ఎక్కడంటే

Published on Jan 25, 2025 2:03 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇండియా వైడ్ గా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఇపుడు ఒక హిస్టారికల్ రికార్డుని తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేసినట్టుగా ఇపుడు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

మన తెలుగు స్టేట్స్ లో చాలా సింగిల్ స్క్రీన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పలు సింగిల్ స్క్రీన్ లో ఇన్నేళ్ల కాలంలో చాలా సినిమాల పేరిట భారీ రికార్డులు ఉన్నాయి. ఇలా ప్రస్తుతం పుష్ప 2 తెలంగాణ హైదరాబాద్ లో సంధ్య 70ఎంఎం స్క్రీన్ లో ఆల్ టైం రికార్డు గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలిపారు మేకర్స్.

ఇక్కడ ఏకంగా 1 కోటి 89 లక్షల 75 వేల 880 రూపాయల గ్రాస్ ని ఈ 51 రోజుల్లో అందుకుందట. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ సింగిల్ స్క్రీన్ కి లేని హైయెస్ట్ వసూళ్లు ఈ చిత్రానికి నమోదు అయ్యాయి. మరి పుష్ప 2 ని ఈ ఒక్క స్క్రీన్ లోనే 206 షోస్ కి గాను ఒక లక్ష 4 వేల 580 మంది చూశారట. దీనితో పుష్ప 2 ఖాతాలో ఈ హిస్టారికల్ రికార్డు పడింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు