బజ్: వైరల్ అవుతోన్న పుష్ప 2 డైలాగ్!

బజ్: వైరల్ అవుతోన్న పుష్ప 2 డైలాగ్!

Published on Dec 12, 2022 12:01 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ పవర్ ను నిరూపించిన చిత్రం పుష్ప. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించింది. ముఖ్యంగా పుష్ప రాజ్ స్టైల్ మరియు స్వాగ్ కి బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఫిదా అయిపోయారు. ప్రస్తుతం, పుష్ప 2 డైలాగ్ గురించి ఆసక్తికరమైన బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కు వేసేస్తే పులి వచ్చిందని అర్థం, అదే ఆ పులి నాలుగు అడుగులు వెనక్కు వేసింది అంటే పుష్ప రాజ్ వచ్చాడనీ అర్థం” అన్నది డైలాగ్. అడవిలోని జంతువులన్నీ పులి గురించి భయపడతాయి, కానీ పుష్ప రాజ్‌ని చూసిన తర్వాత ఆ పులి స్వయంగా లొంగిపోతుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. పుష్ప పార్ట్ 2 షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు