‘పుష్ప – 2’ : ఫస్ట్ సాంగ్ సర్ప్రైజ్ క్యాన్సిల్ ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ యక్షన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈమూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుండి పుష్ప పుష్ప అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఫుల్ సాంగ్ ని మే 1 న ఉదయం 11 గం. 7 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే అంతకంటే ముందు ఒక సెన్సషనల్ సర్ప్రైజ్ ఉంటుందని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసారు. కాగా విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఆ సర్ప్రైజ్ క్యాన్సిల్ అయినట్లు చెప్తున్నారు. కారణాలు తెలియరానప్పటికీ దానిని ఫుల్ సాంగ్ రిలీజ్ టైంలోనే అందించనున్నారట. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి పుష్ప 2 మూవీని ఆగష్టు 15న విడుదల చేయనున్నారు.

Exit mobile version