టాక్..ఈసారి నార్త్ లో “పుష్ప” కి ఎనలేని హైప్?

టాక్..ఈసారి నార్త్ లో “పుష్ప” కి ఎనలేని హైప్?

Published on Nov 19, 2022 6:20 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప ది రైజ్”. మరి బన్నీ మరియు దర్శకుడు సుకుమార్ ల కాంబోలో తెరకెక్కించిన హ్యాట్రిక్ సినిమా ఇది కాగా ఈ సినిమా హిట్ రీసౌండ్ అయితే పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా వినిపించింది.

ఇక దీనితో నెక్స్ట్ అంతా పుష్ప ది రూల్ రెండో సినిమా కోసం ఎదురు చూస్తుండగా ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో ఈ సినిమాకి మళ్ళీ ఆ రేంజ్ హైప్ ఉందా అన్న దానికి ఎలాంటి డౌట్ లేదని వినిపిస్తుంది. అలాగే చాలా వరకు హిందీ ఆడియెన్స్ కూడా ఈ అక్కడి హిందీ స్టార్స్ సినిమాల కన్నా పుష్ప 2 కోసమే మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది.

దీని బట్టి హిందీలో మాత్రం ఈసారి పుష్ప కి నెక్స్ట్ లేసులు క్రేజ్ నెలకొందని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమా సీక్వెల్ ని మరింత గ్రాండ్ వే లో ప్లాన్ చేస్తుండగా మేకర్స్ ఈసారి మరింత స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సుకుమార్ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు