“పుష్ప 2″లో అల్లు అర్జున్ అలాంటి పాత్రలో నటించనున్నాడా?

Published on Jun 6, 2022 11:10 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన “పుష్ప-ది రైజ్” చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. కాగా ఇపుడు పుష్ప..ది రూల్‌పై అంద‌రి ఫోక‌స్ ప‌డింది. అతి త్వరలోనే పట్టాలెక్కనున్న “పుష్ప-2″కి సంబంధించి కొత్తగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది.

‘పుష్ప 1’ లో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్‌గా డీ గ్లామర్ పాత్రలో కనిపించిన అందరినీ ఆకట్టుకున్నాడు. స్టైలిష్ స్టార్‌గా ఉండే బన్నీ.. డీ గ్లామర్ పాత్ర చేస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా అన్న అనుమానం లేకుండా ఆ పాత్రను బాగా డిజైన్ చేసి హిట్ అందించాడు సుకుమార్. అయితే ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ నడివయసు పాత్రలో కనిపించనున్నట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర ఒక సీన్ వరకే పరిమితమా.. లేక సినిమా మొత్తం ఉంటుందా అన్న విషయం ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది మున్ముందు చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :