ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ అత్యంత ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యింది.
ఈసారి ఏకంగా నేషనల్ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా గ్రాండ్ నేషనల్ ప్రెస్ మీట్ పెడుతున్నారు చిత్ర యూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ నేషనల్ ప్రెస్ మీట్లో పాల్గొనబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఒక్కసారిగా అందరి ఫోకస్ ‘పుష్ప-2’ వైపు మళ్ళింది.
ఇక అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో నేషనల్ టాపిక్‌గా మారిపోయింది. వెయ్యి కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
A grand national press meet of #Pushpa2TheRule with the producers and all the distributors ????
Tomorrow from 12 PM onwards ❤????
Watch live here!
▶️ https://t.co/YiLrGIxVmxIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial… pic.twitter.com/vatz1yeYfr
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2024