“పుష్ప” క్లైమాక్స్‌పై ఓ క్లారిటీకి వచ్చేసిన సుకుమార్?

Published on Feb 25, 2022 12:25 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “పుష్ప-ది రైజ్” చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేసిన చిత్ర బృందం “పుష్ప-2” కోసం మళ్లీ కసరత్తును ప్రారంభించింది. ఈ నేపధ్యంలో ప్ర‌స్తుతం స్క్రిప్ట్ రైటింగ్ వ‌ర్క్‌ ప్రారంభించిన సుకుమార్ సెకండ్ పార్ట్‌ని ఎలా ముగించాల‌న్న దానిపై డైలామాలో ఉన్న‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు టాక్ వినిపిస్తూ వస్తుంది.

అయితే “పుష్ప-2” క్లైమాక్స్‌ని హ్యాపీగా ముగించాలా.. లేక ట్రాజెడీతో ముగించాలా.. అనే దానిపై సుకుమార్ ఓ క్లారిటీకి వ‌చ్చాడ‌ట‌. ఓపెన్ ఎండింగ్‌ క్లైమాక్స్ తో సినిమాను ముగించాలని సుకుమార్ ఫిక్స్ అయిన‌ట్టు టాక్‌. ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అయితే ప్రేక్ష‌కులు కూడా కొంత అర్థం చేసుకొనే వీలుంటుందని, కాబ‌ట్టి ట్రాజెడీగా కానీ, హ్యాపీగా కానీ ఉండొద్ద‌ని అనుకుంటున్నాడట. దీంతో ఫైన‌ల్‌గా ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అయితేనే సినిమాకు బాగా షూట్ అవుతుందనుకున్న సుకుమార్ అలానే సిద్దం చేస్తున్నాడట. మరి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :