లేటెస్ట్…గూస్ బంప్స్ తెప్పిస్తున్న “పుష్ప పుష్ప” సాంగ్!

పుష్పరాజ్ పాత్రతో నేషనల్ అవార్డ్ గెలుపొందారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ చిత్రం బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయిన పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేయగా, నేషనల్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే పాటను పాన్ ఇండియా బాషల్లో మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. సాంగ్ ఎలక్ట్రి ఫైయింగ్ గా ఉంది.

దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ను వేరే లెవెల్లో కంపోజ్ చేశారు. బన్నీ మాస్ స్వాగ్ ను వేరే లెవెల్ లో చూపించారు. ఈ ఒక్క పాటతో పుష్పరాజ్ రూలింగ్ ఎలా ఉండబోతుంది అనేది తెలియజేశారు. సాంగ్ లో విజువల్స్ బాగున్నాయి. బన్నీ డాన్స్ తనదైన మార్క్ తో ఆకట్టుకుంది. చివరిగా అస్సలు తగ్గేదేలే డైలాగ్ మరింత గా ఆకట్టుకుంది. ఇంతకాలం ఎదురు చూసిన బన్నీ ఫ్యాన్స్ కి ఇది మంచి ట్రీట్ అని చెప్పాలి. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version