పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ మారబోతుందా?

Published on Mar 23, 2022 2:05 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన “పుష్ప-ది రైజ్” చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి సంగతి తెలిసిందే. బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. కాగా ఇపుడు పుష్ప..ది రూల్‌పై అంద‌రి ఫోక‌స్ ప‌డింది. ఈ ప్రాజెక్టు ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కాగా ఇపుడు పుష్ప..ది రూల్‌పై అంద‌రి ఫోక‌స్ ప‌డింది.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ‌రో అప్డేట్ ఒకటి చ‌క్క‌ర్లు కొడుతోంది. పుష్ప‌ టీం షూటింగ్ ప్లాన్‌ని మార్చేసింద‌ట‌. ఏప్రిల్ నుంచి పుష్ప‌ 2 చిత్రీక‌ర‌ణ మొద‌లుకానున్న‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు టాక్‌ నడుస్తుండగా.. ఏప్రిల్‌లో కాకుండా వేస‌వి చివ‌ర‌లో మే లేదా జూన్ లో షూటింగ్‌ని ప్రారంభించాలని సుకుమార్ టీం భావిస్తుందట. ఇదే కాకుండా ముందుగా అనుకున్న విడుద‌ల తేదీని కూడా మ‌రో డేట్‌కు వాయిదా వేస్తార‌ని టాక్ న‌డుస్తోంది. చూడాలి మరీ అసలు ఏం జరుగుతుందనేది..

సంబంధిత సమాచారం :