ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’పై మేకర్స్ నేడు సాలిడ్ అప్డేట్స్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ఇండియన్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు. అయితే, ఈ సందర్భంగా, ‘పుష్ప-2’ చిత్ర నిర్మాతలు మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.
‘పుష్ప-2’ మూవీ అత్యంత భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఈ సినిమాకు కూడా సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందా..? అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా నిర్మాతలు మాట్లాడుతూ.. కథ పరంగా పుష్ప-3 కి కూడా లీడ్ ఖచ్చితంగా ఉంటుందని.. అయితే, ఈ పుష్ప-2 చిత్రానికి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి తమ తదుపరి నిర్ణయం ఉంటుందని వారు తెలిపారు.
దీంతో సుకుమార్ ‘పుష్ప-2’ చిత్రానికి ఎలాంటి ముగింపును ఇస్తాడా.. అది ‘పుష్ప-3’కి ఎలాంటి దారిని తీస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.