“పుష్ప” రాజ్ ఊచకోత.. 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..

“పుష్ప” రాజ్ ఊచకోత.. 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..

Published on Dec 8, 2024 5:24 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే రికార్డు వసూళ్లు నమోదు చేయగా పాన్ ఇండియా లెవెల్లో సహా వరల్డ్ వైడ్ గా కూడా పుష్ప కళ్ళు చెదిరే నంబర్స్ ని సెట్ చేస్తుంది.

మరి ఇదిలా ఉండగా రెండు రోజుల్లోనే 500 కోట్ల మార్క్ కి వచ్చేసిన ఈ చిత్రం ఇపుడు మూడు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ మూడు రోజుల్లో పుష్ప రాజ్ విధ్వంసం మాములుగా లేదని చెప్పాలి. పుష్ప 2 కి ఏకంగా మూడు రోజుల్లో 600 కోట్లకి పైగా గ్రాస్ ఇపుడు నమోదు అయ్యింది. ఈ మూడు రోజుల్లో ఏకంగా 621 కోట్ల గ్రాస్ ని అందుకొని పుష్ప 2 ఫాస్టెస్ట్ రికార్డుతో సంచలనం రేపింది అని చెప్పాలి. ఇక నాలుగో రోజుతో అయితే ఈజీగా పుష్ప సీక్వెల్ 700 కోట్ల మార్క్ ని దాటేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు