నార్త్ ఆడియెన్స్ లో ‘పుష్ప’ రాజ్ మేనియా విలయ తాండవం..

నార్త్ ఆడియెన్స్ లో ‘పుష్ప’ రాజ్ మేనియా విలయ తాండవం..

Published on Dec 10, 2024 3:17 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” భారీ రికార్డులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ రికార్డు వసూళ్లు కొల్లగొడుతుండగా మెయిన్ గా హిందీ వసూళ్లు అయితే మన తెలుగు వెర్షన్ వసూళ్ళని కూడా డామినేట్ చేస్తూ సంచలనం సెట్ చేస్తున్నాయి.

మరి అల్లు అర్జున్ కి హిందీ ఆడియెన్స్ లో రేంజ్ క్రేజ్ ఉందో తెలిసిందే. దీంతో అసలు పుష్ప 2 మేనియా నార్త్ ఆడియెన్స్ లో ఏ లెవెల్లో ఉందో మేకర్స్ ఇపుడు క్రేజీ వీడియో వదిలారు. మరి ఇందులో ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్ప 2 థియేటర్స్ దగ్గర జన సందోహం ఏ లెవెల్లో ఉందో చూపించిన దృశ్యాలు అల్లు అర్జున్ క్రేజ్ కి అద్దం పడుతున్నాయని చెప్పాలి. భారీ స్థాయిలో పుష్ప 2 టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర జనం బారులు తీరుతున్నారు. దీనితో పుష్ప రాజ్ తాండవం మాత్రం మామూలు లెవెల్లో లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు