అప్పటికి పూర్తి కానున్న ‘పుష్ప – 2’ షూట్ ?

అప్పటికి పూర్తి కానున్న ‘పుష్ప – 2’ షూట్ ?

Published on Jan 13, 2024 6:56 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ పై దేశవ్యాప్తంగా ఆడియన్స్ లో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి.

విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క షూట్ మొత్తం మే 2024 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించి టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాల పై దృష్టి పెట్టనున్నారట. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆగష్టు 15న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు