ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రశ్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సీక్వెల్ మన ఇండియన్ సినిమా దగ్గర మరో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ జాబితాలో నిలిచింది. అయితే ఈ సినిమా పనులు అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.
ఇంకో పక్క బిజినెస్ లెక్కలు అంటూ భారీ నంబర్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇలా పుష్ప 2 కోసం పాన్ ఇండియా మార్కెట్ లో ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి లేటెస్ట్ గా ఆన్లైన్ సినిమా బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో పుష్ప రాజ్ తన రూల్ చూపిస్తున్నాడు అని చెప్పాలి. బుక్ మై షో అలాగే పే టి ఎం లలో కలిపి ఏకంగా 7 లక్షల ఇంట్రెస్ట్స్ ని పుష్ప 2 నమోదు చేసింది. ఇంకా సినిమా రిలీజ్ కి చాలా సమయం ఉన్న గ్యాప్ లోనే ఈ రేంజ్ సెన్సేషన్ ని చూపించడం విశేషం. మొత్తానికి పుష్ప గాడి రూలు ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
PUSHPA RAJ's BRAND ❤????#Pushpa2TheRule gets 700K+ interests on @bookmyshow & @Paytm ????
Highest among all upcoming Indian Films ????????
THE RULE IN CINEMAS on 6th DEC 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial… pic.twitter.com/AMfB8rqwfl
— Pushpa (@PushpaMovie) October 22, 2024