‘పుష్ప 2’ : ఈ రోజు తగ్గుతున్న టికెట్ ధరలు !

‘పుష్ప 2’ : ఈ రోజు తగ్గుతున్న టికెట్ ధరలు !

Published on Dec 9, 2024 10:04 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.621 కోట్లను రాబట్టింది. పైగా ఈ మైలురాయిని అత్యంత వేగంగా సాధించిన భారతీయ చిత్రంగా కూడా ‘పుష్ప 2’ నిలిచింది. ఐతే, తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమాకి ఉన్న అధిక టికెట్ ధరలపై ఎన్నో విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (ఏపీ), తెలంగాణలలో బెనిఫిట్ షో టికెట్ ధరలకు రూ. 800–రూ. 1,000 వసూళ్లు చేశారు. ఇక చాలా సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరలు రూ. 300 వరకూ ఉంది.

కాగా ఈ రోజు నుండి, ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాలలో టికెట్ ధరలు తగ్గబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర రూ.200, అలాగే, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.300 to 395 వరకూ తగ్గే అవకాశం ఉంది. మరి తగ్గిన టికెట్ ధరలు కారణంగా సాధారణ ప్రేక్షకులు థియేటర్స్ కి ఎక్కువ వస్తారేమో చూడాలి. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించాడు. ఇక సపోర్టింగ్ క్యాస్ట్‌లో జగపతి బాబు, సునీల్, అనసూయ మరియు రావు రమేష్ వంటి నటీనటులు నటించారు. కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు