‘పుష్ప 2’ రెగ్యులర్ షూటింగ్ అప్పటి నుంచే ?

Published on Dec 4, 2022 10:47 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రష్యాలో కూడా రిలీజ్ కాబోతుంది. బన్నీ, సుకుమార్ లతో పాటు టీమ్ కూడా రష్యా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఐతే, మరోపక్క పుష్ప 2 షూట్ ను ఈ నెల 26 నుంచి ప్లాన్ చేస్తున్నారట. 10 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో బన్నీ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట.

ఇక ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయి. ప్రముఖ నటీనటులు ఈ సీక్వెల్ లో కనిపించనున్నారు. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఏది ఏమైనా ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు.

సంబంధిత సమాచారం :