‘పుష్ప 2’ రెగ్యులర్ షూట్ డేట్ అదేనా ?

‘పుష్ప 2’ రెగ్యులర్ షూట్ డేట్ అదేనా ?

Published on Oct 31, 2022 4:29 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందా అని బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజా అప్ డేట్ ఏమిటంటే, సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను వచ్చే నెల నవంబర్ 7 నుంచి ప్రారంభించనున్నారు. ఈ మొదటి షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయి. ప్రముఖ నటీనటులు ఈ సీక్వెల్ లో కనిపించనున్నారు. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు