టాప్-100లో “పుష్ప” ఆల్ సాంగ్స్..!

Published on Jan 4, 2022 3:02 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం “పుష్ప”. డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతుంది. ఇదిలా ఉంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలకు ఎంత క్రేజ్ లభించిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఈ సినిమాలోని 5 పాటలు యూట్యూబ్‌లో టాప్ 100 గ్లోబల్ సాంగ్స్ జాబితాలో ఉన్నాయి. మొదటి స్థానంలో ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్, రెండో స్థానంలో సామి సామి సాంగ్, 24వ స్థానంలో శ్రీవల్లి సాంగ్, 74వ స్థానంలో దాక్కో దాకో మేక సాంగ్, 97వ స్థానంలో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ఉన్నాయి. ఇలా ఐదు పాటలు టాప్ 100 ట్రెండింగ్‌లో ఉండడం నిజంగా రికార్డ్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :