ఈ సోమవారం నైజాంలో “శ్యామ్”, “పుష్ప” కలెక్షన్ డీటెయిల్స్.!

Published on Dec 28, 2021 3:15 pm IST


ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గరకి కేవలం కొన్ని సినిమాలే వచ్చినా టాలీవుడ్ ఆడియెన్స్ ని ఎంత గానో అలరించిన సినిమాలు మాత్రం వాటిలో ఎక్కువే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ముగిసే నెల డిసెంబర్ లో మాత్రం మూవీ లవర్స్ కి ఒక ట్రీట్ ఇచ్చిన నెల అని చెప్పాలి. “అఖండ” నుంచి నుంచి మొదలయ్యి “పుష్ప”, “శ్యామ్ సింగ రాయ్” చిత్రాలు ఆడియెన్స్ కి సాలిడ్ ట్రీట్ ని అందించాయి.

అయితే వీకెండ్స్ లో సినిమాలు బాగానే ఉన్నా వాటికీ టెస్ట్ పెట్టేది మాత్రం వర్కింగ్ డే మండే అని చెప్పాలి. మరి ఈ వారం పుష్ప, అలాగే శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు నైజాం వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. వీటిలో పుష్ప చిత్రానికి గాను 40 లక్షల షేర్ రాగా శ్యామ్ సింగ్ రాయ్ కి మాత్రం 55 లక్షల షేర్ మార్క్ ని అందుకుంది. ఇది ఈ రెండు సినిమాలకు కూడా సోమవారం నాడు మంచి హోల్డ్ అని చెప్పాలి. ఇక మిగతా టోటల్ ఏరియాలకు సంబంధించి వివరాలు రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :