వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “పుష్ప”

Published on Mar 2, 2022 1:30 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి పలు రికార్డు లని బద్దలు కొట్టడం మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ కెరీర్ లోనే ఐకానిక్ మూవీ గా మారిపోయింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా వచ్చి ప్రేక్షకులను అలరించింది.

ఈ చిత్రం మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. మాస్ బొమ్మ పుష్ప దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా, వరల్డ్ వైడ్ గా తన సత్తా ఏంటో చూపించడం జరిగింది. బుల్లితెర పై ఏ తరహా రెస్పాన్స్ వస్తుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్మీక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సమంత స్పెషల్ సాంగ్ లో నటించగా, అనసూయ భరద్వాజ్, సునీల్, ధనంజయ, అజయ్, అజయ్ ఘోష్, ఫాహద్ ఫజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండవ పార్ట్ పుష్ప ది రూల్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :