“పుష్ప” అవైటెడ్ ఓటిటి హిందీ వెర్షన్ వచ్చేసింది.!

Published on Jan 14, 2022 6:57 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం థియేట్రికల్ గా సేఫ్ అయ్యాక ఓటిటి లో రిలీజ్ అయ్యి మరింత స్థాయి భారీ రెస్పాన్స్ ని అందుకుంది.

అయితే మొదట సౌత్ ఇండియన్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఈరోజు నుంచి తెలుగు ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హిందీ వెర్షన్ ని ప్రైమ్ వీడియో వారు తీసుకొచ్చారు. ఈ సినిమా హిందీలో కూడా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే.

అందుకే అసలు హిందీలో కూడా ఈ సినిమా ఉందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకు ఈ వెర్షన్ కూడా వచ్చేసింది. దీనికి వ్యూవర్ షిప్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :