365 కోట్లతో “పుష్ప” బాక్సాఫీస్ సెన్సేషన్..!

Published on Feb 4, 2022 12:22 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్” రిలీజ్ అయ్యి పాన్ ఇండియా వైడ్ కూడా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో మరో వరుస హైయెస్ట్ గ్రాసర్ గా ఇది నిలిచింది. మరి దీనితో పాటుగా తన మొదటి స్టెప్ లోనే హిందీ మార్కెట్ లో 100 కోట్ల మార్కెట్ కి తలుపులు తెరచి సెన్సేషన్ నమోదు చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు విజయవంతంగా 50 రోజుల రన్ ని పూర్తి చేసుకున్నాడు.

మరి ఇప్పుడు ఈ భారీ చిత్రం మొత్తం 50 రోజులకి గాను ఏకంగా 365 కోట్లు గ్రాస్ ని వసూలు చేసినట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. మరి దీనిపై ఒక అదిరే పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి ఈ 50 రోజుల్లో పుష్ప ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ మార్క్ వసూళ్ళని అందుకుంది అని తెలుపుతున్నారు. మొత్తానికి మాత్రం ఇలా పుష్ప బాక్సాఫీస్ సెన్సేషన్ ఇక్కడితో ఆడిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :