“పుష్ప” సీడెడ్ మరియు ఉత్తరాంధ్ర డే 1 కలెక్షన్ డీటెయిల్స్.!

Published on Dec 18, 2021 6:13 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్” నిన్ననే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ 5 మొత్తం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఇక ఈ చిత్రం రిలీజ్ తోనే మళ్ళీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల లెక్కలు స్టార్ట్ అయ్యాయి.

అయితే ఆల్రెడీ నైజాం లో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు 11 కోట్లకి పైగా షేర్ ని రాబట్టగా ఇప్పుడు సినిమా ఉత్తరాంధ్ర మరియు సీడెడ్ వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. మరి సీడెడ్ లో ఈ చిత్రం మొదటి రోజు 3.9 కోట్ల షేర్ ని రాబట్టగా ఉత్తరాంధ్రాలో ఈ చిత్రం 1.8 కోట్ల రూపాయల షేర్ సాలిడ్ వసూళ్ళని అందుకుంది.

అయితే ఏపీలో టికెట్ ధరల ప్రభావం కానీ లేకుండా ఉంటే పుష్ప చిత్రం మరిన్ని వసూళ్లు రాబట్టి ఉండేది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొదటి బాగానే ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజులు కూడా పుష్ప బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :