వైరల్ : క్రికెట్ లో ఏమాత్రం తగ్గని “పుష్ప” మ్యానియా.!

Published on Apr 19, 2022 9:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అనేక అంశాల్లో అదిరే లెవెల్ ట్రెండ్ ని సెట్ చేసింది. మరి అలాగే వీటిలో ఐకాన్ స్టార్ చేసిన “తగ్గేదేలే” సిగ్నేచర్ మూమెంట్ నమోదు చేసిన ఇంపాక్ట్ అయితే అంతా ఇంతా కాదు.

అలాగే ఇది ముఖ్యంగా మన ఇండియన్ క్రికెట్ దగ్గర గాని ఇంటర్నేషనల్ క్రికెటర్స్ లో కానీ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. మరి నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ లో కూడా ఓ వెస్టిండీస్ ప్లేయర్ మెక్ కాయ్ మ్యాచ్ చివర్లో కీలక వికెట్ తీయగా వెంటనే పుష్ప మూమెంట్ చేసాడు. దీనితో ఆ మ్యాచ్ లో ఇది హైలైట్ కాగా సోషల్ మీడియాలో కూడా ఇది మరింత వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే ఈ సినిమా మ్యానియా మాత్రం ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :