ఇక్కడ “పుష్ప”తో పోటీ వద్దనుకున్న హాలీవుడ్ భారీ సినిమా?

Published on Nov 30, 2021 8:59 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప”. మొట్ట మరెందు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాల్లో మొదటిది ప్రపంచ వ్యాప్తంగా కూడా వచ్చే డిసెంబర్ 17న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ నే మూవీ లవర్స్ లో చిన్న టెన్షన్ కూడా ఉంది.

ఎందుకంటే సరిగా ఇదే డిసెంబర్ 17న హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “స్పైడర్ మ్యాన్ నో వే హోమ్” రిలీజ్ కూడా ఉంది. అలాగే మన దేశంలో కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. కానీ ఇలాంటి రెండు భారీ సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అనేది మాత్రం ఓ రకమైన టెన్షన్ నే నెలకొల్పింది. ఖచ్చితంగా ఒకే రోజు రిలీజ్ అయితే వసూళ్ల పరంగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది.

మరి ఎట్టకేలకు ఈ పోటీలో స్పైడర్ మ్యాన్ యూనిట్ నే త్వరపడ్డారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 16కి షిఫ్ట్ చేసి ఇండియన్ వెర్షన్ ని హిందీ, తెలుగు, తమిళ్ మరియు ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు సోనీ పిక్చర్స్ వారు కొత్త డేట్ తో పోస్టర్స్ రిలీజ్ చేశారు. మరి ఇది పుష్ప తో పోటీ వద్దనుకుని చేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :