తగ్గేదే లే అంటున్న దాక్కో దాక్కో మేక..!

Published on Sep 19, 2021 1:51 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలోని “దాక్కో దాక్కో మేక” తెలుగు పాటను ఆగస్టు 13న రిలీజ్ చేయగా ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

తగ్గదేలా అన్నట్టుగా ఇప్పటివరకు ఈ పాట 45 మిలియన్ ప్లస్ వ్యూస్‌ను కొల్లగొట్టింది. ఇకపోతే ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ముత్తం శెట్టి మీడియాతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :