తగ్గేదే లే.. పుష్ప నుంచి ఫోర్త్‌ సింగిల్‌ లిరికల్ ప్రోమో వచ్చేసింది..!

తగ్గేదే లే.. పుష్ప నుంచి ఫోర్త్‌ సింగిల్‌ లిరికల్ ప్రోమో వచ్చేసింది..!

Published on Nov 16, 2021 8:03 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తగ్గేదే లే అన్నట్టుగా వరుస అప్డేట్లతో ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా జోరుగానే జరుగుతున్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే ఫోర్త్‌ సింగిల్‌ లిరికల్‌ ప్రోమో రిలీజ్ అయ్యింది. నవంబర్‌ 19న ఉదయం 11:07 గంటలకు ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’, ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి’ ‘సామీ సామీ’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు