“పుష్ప” గాడ్ లెవెల్ క్రేజ్..తగ్గేదేలే అంటున్న వరల్డ్ మహిళా బౌలర్.!

Published on May 7, 2022 8:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా “పుష్ప”. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాల్లో మొదటి భాగం గత ఏడాది డిసెంబర్ లో సెట్టింగ్ హిట్ అయ్యింది.

పాన్ ఇండియా లెవెల్లో కూడా అన్ని భాషల్లో మంచి వసూళ్లు కొల్లగొట్టి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా ఈ సినిమా సెట్ చేసిన కొన్ని ట్రెండ్ లు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే మ్యానరిజం అయితే ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో గాడ్ లెవెల్ క్రేజ్ తో వైరల్ గా మారింది.

తాజాగా అయితే ఓ ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్ లో ఓ మహిళా బౌలర్ తన వికెట్ తీసాక ఆ హ్యాపీ సెలెబ్రేషన్స్ ని తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ టైప్ లో రెండు సార్లు అంటూ చేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా చెయ్యడం మరింత ఆసక్తిగా మారింది. దీనితో ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మొత్తానికి అయితే పుష్ప సెట్ చేసిన ట్రెండ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :