కంటిన్యూ అవుతున్న “పుష్ప” హవా..11వ రోజు వసూళ్లు ఎంతంటే?

Published on Dec 28, 2021 11:33 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా “పుష్ప పార్ట్ 1” రిలీజ్ చేసి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యిన అన్ని భాషల్లో కూడా సాలిడ్ టాక్ తెచ్చుకొని కంటిన్యూ అవుతున్న పుష్ప తెలుగు రాష్ట్రాల్లో పదకొండవ రోజు కూడా భారీ వసూళ్లను కొల్లగొడుతూ అదరగొట్టింది.

ఈ చిత్రానికి గాను తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు చూసినట్టు అయితే నైజాం లో 40 లక్షలు రాబట్టిన సంగతి తెలిసిందే. అలానే ఆంధ్రా లో ఈ చిత్రానికి 39 లక్షలు అలాగే సీడెడ్ లో 20 లక్షలు ఈ సినిమా రాబట్టింది. దీనితో ఈ 11వ రోజు అలాగే అందులోని సోమవారం పుష్ప రాజ్ 1 కోటి షేర్ ని రాబట్టి తన హవా కొనసాగిస్తున్నాడు. మరి ఈ భారీ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :