చివరి నిమిషంలో అక్కడ “పుష్ప” సెన్సార్..!

Published on Dec 16, 2021 7:04 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప ది రైజ్”. మొదట అంతా ప్లాన్ ప్రకారమే నడిచినా తర్వాత అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చెయ్యాలనే కారణంతో మేకర్స్ చాలా కష్టపడి సినిమాని కంప్లీట్ చేశారు. అలాగే దర్శకుడు సుకుమార్ అయితే ఫస్ట్ కాపీ కోసం సర్వత్రా కష్టపడి పంపాడు.

కానీ మన దగ్గర మాత్రం హిందీ వెర్షన్ సెన్సార్ కి లాస్ట్ మినిట్ లో దెబ్బ పడింది. పూర్తి స్థాయి సినిమా చూడకుండా సెన్సార్ ఎలా చేసేది అని వారు తిరస్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది ఈరోజు క్లియర్ అవ్వనుంది అట. పుష్ప కంప్లీట్ సినిమా ఈరోజు హిందీ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

మొత్తానికి మాత్రం పుష్ప కి కూడా సుకుమార్ గత సినిమాల కష్టాలు తప్పలేదు. మరి ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :