వైరల్: సమంత ఐటం సాంగ్‌కి అదిరిపోయే పేరడీ..!

Published on Dec 18, 2021 12:01 am IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత “పుష్ప” సినిమాలో ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. “ఊ అంటావా మామ.. ఊఊ అంటావా” అని సాగే ఈ పాటకు క్రేజీ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో “మగవాళ్ల బుద్ధే వంకర బుద్ధి” అనే లిరిక్స్‌ ఉండడంతో దీనిపై పురుష సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ ఐటం పాటకు ఓ అదిరిపోయే పేరడీ వచ్చేసింది. “మగవాళ్ల బుద్ధే వంకర బుద్ధి” అని ఉన్న దగ్గర “ఆడ బుద్ధే వంకర బుద్ధి” అంటూ “ఊ అంటావా పాప.. ఊఊ అంటావా” అని పేరడీ చేశారు. అయితే కేవలం వినోదం కోసమే ఈ పాటను చేసినట్టు రూపకర్తలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పేరడీ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరీ మీరు కూడా ఈ పాటను ఓసారి వినేయండి.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :