సరికొత్త రికార్డ్ నెలకొల్పిన “పుష్ప” ఐటం సాంగ్..!

Published on Dec 12, 2021 12:56 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17 వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం నాడు సమంత ఐటం సాంగ్ “ఊ అంటావా.. ఊఊ అంటావా’ సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే.

అయితే ఈ పాట యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తోంది. 24 గంటల్లో నాలుగు భాషల్లో కలిపి 14 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్‌గా నిలిచింది. సమంతకు ఉన్న క్రేజ్, దేవిశ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్, సింగర్ ఇంద్రావతి వాయిస్ ఈ పాటకు పెద్ద ప్లస్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఐటం సాంగ్ ‘ఋఋఋ’ ట్రైలర్ తర్వాత ట్రెండింగ్-2లో ఉంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :