పుష్ప లేటెస్ట్ ‘నైజాం కృష్ణా గుంటూరు’ కలెక్షన్స్ !

పుష్ప లేటెస్ట్ ‘నైజాం కృష్ణా గుంటూరు’ కలెక్షన్స్ !

Published on Dec 20, 2021 10:27 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా ‘పుష్ప- ది రైజ్’. గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షో నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. ఇప్పటివరకు అయితే.. కలెక్షన్స్ విషయంలో ‘పుష్ప’ ఏ మాత్రం తగ్గడం లేదు.

నిన్న నైజాంలో 6.65 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మూడు రోజులకు గానూ నిజాంలో 23 కోట్లకు పైగానే రాబట్టింది. కృష్ణా జిల్లాలో మూడో రోజుకు గాను 81 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో 2.72 కోట్లు వసూలు చేసింది. అలాగే గుంటూరు విషయానికి వస్తే.. మూడో రోజుకు గాను 65 లక్షలు వసూలు చేసింది. ఇక గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 3.5 కోట్లు వసూలు చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు