“పుష్ప” నుంచి త్వరలోనే సెకండ్ సింగిల్ అప్డేట్..!

Published on Sep 28, 2021 2:56 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలోని ఓ సాంగ్ అద్భుతమైన లొకేషన్లో షూటింగ్ జరుపుకుంది అంటూ ఆ ఫోటోను షేర్ చేశారు.

అంతేకాదు త్వరలోనే ఈ సినిమా సెకండ్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించబోతున్నట్టు కూడా తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి సాంగ్ “దాక్కో దాక్కో మేక”కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :