ఓటిటిలో వచ్చినా కూడా హిందీలో “పుష్ప” వసూళ్ల మ్యానియా..!

Published on Jan 27, 2022 4:05 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని గత డిసెంబర్ లో రిలీజ్ చెయ్యగా ఆ ఏడాదికే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.

మరి అంతే కాకుండా హిందీలో ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు అయితే ట్రేడ్ వర్గాలకి షాక్ ఇచ్చాయి. అల్లు అర్జున్ సినిమా కోసం ఆడియెన్స్ ఈ రేంజ్ లో వస్తారా అని ప్రతి రోజు నిలకడగా వచ్చిన వసూళ్లు సమాధానం ఇచ్చాయి. ఇక లేటెస్ట్ గా అయితే అన్ని భాషల్లోని ఈ చిత్రం ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యిపోయింది.

అయినా ఈ చిత్రం వసూళ్లు మాత్రం బాలీవుడ్ లో ఎక్కడా తగ్గడం లేదు. లేటెస్ట్ గా నిన్న రిపబ్లిక్ డే హాలిడే లో కోటిన్నర వసూలు చేసిందట. ఇన్ని రోజులు అయినా పుష్ప ఇంత స్ట్రాంగ్ హోల్డ్ కనబర్చడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. మొత్తానికి అయితే పుష్ప 100 కోట్ల మార్క్ ని హిందీలో అందుకోవడంలో తగ్గేదేలే..

సంబంధిత సమాచారం :