“పుష్ప” మాస్ క్రేజ్..WWE లో ఐకాన్ స్టార్ మ్యానరిజం.!

Published on Jul 1, 2022 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “పుష్ప ది రైజ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా అందరి అంచనాలు మించి భారీ స్థాయిలో రీచ్ ని తెచ్చుకుంది. అది పాటలైతే కానీ అల్లు అర్జున్ శ్రీవల్లి స్టెప్ అయితే గాని లేదా తగ్గేదేలే అంటూ గడ్డం కింద నుంచి చెయ్యి అలా పోనిచ్చినా ఇవి సెన్సేషనల్ రీచ్ ని సొంతం చేసుకున్నాయి.

ఇక ఇప్పుడు తాజాగా ప్రపంచ ప్రముఖ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైనింగ్ షో(WWE) లో మన ఇండియన్ రెజ్లర్ అయినటువంటి సౌరవ్ గుర్జార్ తన ఫైట్ లో ఐకాన్ స్టార్ మ్యానరిజాన్ని చూపించాడు. దీనితో ఈ వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. దీనితో అయితే పుష్ప మాస్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదని చెప్పి తీరాలి. ఇక ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :